Politics19th Aug 04:12 PMSunil Byrisetty1 min read
అమరావతి ఆంధ్రుల సెంటిమెంట్..
అమరావతి మునిగిపోయిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేయడంపై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. వర్షాకాలం వర్షాలు పడటం
అమరావతి మునిగిపోయిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేయడంపై హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. వర్షాకాలం వర్షాలు పడటం సహజమని, పునాదుల కోసం తవ్విన గోతుల్లో కొంత నీరు నిలిస్తే, అమరావతి మునిగిపోయిందంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్న వారు సీడ్ యాక్సెస్ రోడ్డులో వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. వర్షాలు పడితే నీరు నిలిచిన ఫొటోల పేరుతో వైసీపీ సోషల్ మీడియాలో నెగటివ్ యాంగిల్లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని సెంటిమెంట్ గా తీసుకున్న మహిళలంతా రాజధాని కోసం ఐదేళ్లపాటు పోరాటం చేసిన విషయం తెలియదా అంటూ నిలదీశారు. అమరావతి కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ ముందుకెళ్తుంటే, రాజధానిపై బురద జల్లడమేంటని ప్రశ్నించారు. ప్రజల్లో ఆందోళన, అభద్రతాభావం రేపేలా ప్రచారం చేస్తున్న వారిపై కేసులు పెట్టకూడదా అని అనిత అడిగారు. అమరావతి రోడ్లపై సజావుగా ప్రయాణించే పరిస్థితి ఉంటే మునిగిపోయిందంటూ ప్రచారం చేయడమేంటని హోంమంత్రి నిలదీశారు.