Politics23rd Jun 06:02 PMSunil Byrisetty1 min read
మాజీ సీఎం జగన్ కు బాధ్యత లేదా?
సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, మాజీ సీఎంగా చేసిన వ్యక్తి మరింత బాధ్యతగా, సత్ప్రవర్తనతో ఉండాలని హోం మంత్రి అనిత అన్నారు. ప్రజలందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గమనిస్తుంటారన
సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, మాజీ సీఎంగా చేసిన వ్యక్తి మరింత బాధ్యతగా, సత్ప్రవర్తనతో ఉండాలని హోం మంత్రి అనిత అన్నారు. ప్రజలందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గమనిస్తుంటారన్నారు.
అలాంటిది, రాజకీయ నాయకులుగా ఉండి మానవత్వం లేకుండా హింసను ప్రేరిపించడంతోపాటు హింసకు పాల్పడటం సిగ్గుచేటని జగన్ పై మండిపడ్డారు. పోలీసులు నోటీసులు జారీ చేసైనా బాధ్యత లేకుండా ఇద్దరి చావుకు జగన్ కారణమయ్యారని ఆరోపించారు.
ఆ కుటుంబాలను సైతం పరామర్శించలేదని జగన్ పై అనిత విమర్శలు చేశారు.