Politics9th Apr 12:57 PMSunil Byrisetty1 min read

అంతా జగన్నాటకమే..!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్ మోహ

అంతా జగన్నాటకమే..!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలు 11 సీట్లతో తీర్పిచ్చినా సిగ్గు రాలేదా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఐపీసీ కన్నా వైసీపీ కోడ్ అమలైందన్నారు. రాప్తాడు నియోజకవర్గానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడి పరిస్థితుల దృష్ట్యా 1100 మంది పోలీసులతో రక్షణ ఇచ్చామన్నారు. 250 మంది పోలీసులు హెలిపాడ్ వద్ద ఉన్నారని తెలిపారు. వీఐపీని తీసుకువెళ్లడానికి వీలుకాని హెలికాప్టర్ 15 నిమిషాల్లో ఎలా ఎగిరి వెళ్లిందని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని అనిపిస్తోందని... వీటన్నింటి పైన విచారణ కొనసాగుతుందని తెలిపారు
Andhra Pradesh
Minister Vangalapudi Anitha
YS Jagan
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం
పోలీసులు
Scroll for the next article