Politics17th Jul 05:40 PMSunil Byrisetty1 min read
బోస్ డీకే సినిమా డైలాగే.. ఎందుకు అరెస్ట్ చేశారు
కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని జగన్ చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పర్యటనలకు అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. సినిమా డైలాగ్ బ్యా
కూటమి ప్రభుత్వంపై బురద చల్లాలని జగన్ చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పర్యటనలకు అడ్డుకోలేదా అని ప్రశ్నించారు. సినిమా డైలాగ్ బ్యానర్ లో వేస్తే తప్పు కాదంటున్నారని, మరి పట్టాభి బోస్ డీకే అంటే ఎందుకు అరెస్ట్ చేశారని, బోస్ డీకే కూడా సినిమా డైలాగే కదా అని ప్రశ్నించారు. రప్పా రప్పా అని నరుకుతామంటే కేసులు పెట్టరా అనడిగారు. మాజీ మంత్రి పేర్ని నాని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలాగని నిలదీశారు. గత ప్రభుత్వంలో కేసులపై ..ఇప్పుడు కేసులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను కోర్టు కూడా తప్పుబట్టిందని హోంమంత్రి అనిత గుర్తు చేశారు.