News13th May 02:10 PMSunil Byrisetty1 min read
పర్యాటకులకు ఇంటి ఆతిథ్యం.. వినూత్న ప్రయోగం!
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు 'ఇంటిలో ఆతిథ్యం' ఇవ్వాలనుకునేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు పిలుపునిచ్చారు. ఎవరికైనా సొంత ఇల్లు/విల్లా/అపార్టుమెంట్ ఫ్లాట్ ఉం
విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు 'ఇంటిలో ఆతిథ్యం' ఇవ్వాలనుకునేవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పర్యాటక శాఖ అధికారులు పిలుపునిచ్చారు.
ఎవరికైనా సొంత ఇల్లు/విల్లా/అపార్టుమెంట్ ఫ్లాట్ ఉండి, వాటిని పర్యాటకులకు రోజువారీ పద్ధతిలో అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖాధికారిణి జె.మాధవి సూచించారు.
చాలామంది పర్యాటకులు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను రుచి చూడాలనుకుంటారు.
సాధారణ హోటళ్లలో ఇలాంటివి లభించవు.
అందుకే స్థానిక విధానంలో 'వసతి సౌకర్యాలు' కల్పించడాన్ని 'హోమ్ స్టే'గా వ్యవహరిస్తున్నారు.
మలేషియా వంటి దేశాల్లో, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హోమ్ స్టే ఆదరణ పొందింది.
ఏపీ ప్రభుత్వం దీనిని నూతన పర్యాటక పాలసీలో చేర్చింది.
కనీసం ఒక గది నుంచి ఆరు గదుల వరకు అన్ని వసతులతో పర్యాటకులకు అందించగలిగేవారు పేర్లు నమోదు చేయించుకోవాలని పిలుపునిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్థ (ఏపీటీఏ) వెబ్‌సైట్‌లో ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఇతర వివరాలకు 0891-2754716 నంబరులో సంప్రతించాలని జె.మాధవి సూచించారు.