Mobiles23rd May 12:42 PMSunil Byrisetty1 min read

200MP కెమెరా, 6000mAh బ్యాటరీతో హానర్ 400

ప్రముఖ మొబైల్ సంస్థ హానర్‌ 400 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ విడుదల చేసింది. హానర్‌ 400 సిరీస్‌లో హానర్‌ 400, 400 ప్రో మోడల్స్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. 200MP కెమెరాతో,

200MP కెమెరా, 6000mAh బ్యాటరీతో హానర్ 400
ప్రముఖ మొబైల్ సంస్థ హానర్‌ 400 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ విడుదల చేసింది. హానర్‌ 400 సిరీస్‌లో హానర్‌ 400, 400 ప్రో మోడల్స్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. 200MP కెమెరాతో, మోడల్‌ IP68 + IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి. హానర్‌ 400 మోడల్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల FHD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్రో మోడల్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. హానర్ 400 స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 చిప్‌సెట్‌‌తో, ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత MagicOS 9.0 పైన పనిచేసే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్‌ పొందుతాయి. బేస్‌ వేరియంట్ 200MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్‌ కెమెరాలను, ప్రో మోడల్‌ 200MP + 50MP టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ రెండు మోడల్స్‌ 50MP కెమెరాను కలిగి ఉన్నాయి. హానర్ 400 స్మార్ట్‌ఫోన్ 66W ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో కేవలం 15 నిమిషాల్లోనే 44 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేస్తుంది. ప్రో మోడల్‌ 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. డిజర్ట్‌ గోల్డ్‌, లూనార్‌ గ్రే, మిడ్‌నైట్‌ బ్లాక్‌ కలర్‌ వేరియంట్స్‌లో బేస్‌ మోడల్‌ లభిస్తుంది. భారత్‌ కరెన్సీ ప్రకారం సిరీస్‌ ప్రారంభ ధర సుమారు రూ.45 వేలుగా ఉంది.
smartphones
HONOR 400 Series
HONOR Malaysia
200mp camera
హానర్‌ 400 స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ విడుదల చేసింది
6000mAh బ్యాటరీ
Scroll for the next article