Mobiles29th Jun 11:57 AMSunil Byrisetty1 min read

ట్యాబ్లెట్ లాంటి ఫోల్డ్ ఫోన్!

స్మార్ట్ ఫోన్లు వచ్చాక ట్యాబ్లెట్‌కి ఫోన్‌కి పెద్ద తేడా తెలియడం లేదు. అరచేతి సైజులో స్మార్ట్ ఫోన్లు ఉండగా.. మరికాస్త పెద్దగా ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. అదే ఫోల్డ్ ఫోన్ చూస్తే

ట్యాబ్లెట్ లాంటి ఫోల్డ్ ఫోన్!
స్మార్ట్ ఫోన్లు వచ్చాక ట్యాబ్లెట్‌కి ఫోన్‌కి పెద్ద తేడా తెలియడం లేదు. అరచేతి సైజులో స్మార్ట్ ఫోన్లు ఉండగా.. మరికాస్త పెద్దగా ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. అదే ఫోల్డ్ ఫోన్ చూస్తే.. మూస్తే ఫోన్‌లాగా, తెరిస్తే ట్యాబ్లెట్‌లాగా కనిపిస్తాయి. ప్రముఖ చైనా సంస్థ హువావె ఇలాంటి తన కొత్త హానర్‌ మ్యాజిక్‌ వీ2 5జీ ఫోల్డ్ ఫోన్‌ను తెచ్చింది. మడత పెట్టినప్పుడు ఫోన్‌లా, విప్పినప్పుడు ట్యాబ్లెట్‌లా కనిపించడం దీని ప్రత్యేకత. మడత ఫోన్లలో తేలికైనదే కాక, నాజూకైంది కూడా. దీని తెర 7.92 అంగుళాలు, వెనక 50+20+50 పిక్సెళ్ల కెమెరా, ముందు 16 మెగా పిక్సెళ్ల కెమెరాతో మార్కెట్లోకి వచ్చింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెనరేషన్‌ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది. 256 జీబీ నుంచి 1టీబీ స్టోరేజీ, 16 జీబీ ర్యామ్‌ ఉంటుంది. బరువు 231 గ్రాములు ఉన్న ఈ ఫోన్ ధర రూ. 1,02,999గా ఉంది.
Mobile
larger tablet
Chinese company Huawei
Honor Magic V2 5G foldable phone
7.92 inches
16 mega pixel camera
Scroll for the next article