News8th Oct 04:04 PMSunil Byrisetty1 min read
బంజారా తండాల గుడి పూజారులకు 15 వేల గౌరవ వేతనం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ, విద్యా సహాయకులకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని వెల్ఫే
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సంక్షేమ, విద్యా సహాయకులకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖలో పదోన్నతి అవకాశాలు కల్పించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. బంజారా తండాల గుడి పూజారులకు రూ.15 వేల గౌరవ వేతనం ఇవ్వాలని బంజారా ధర్మ రక్షా సమితి కోరింది. బంజారా ఆలయాలకు ధూప, దీప, నైవేద్య పథకం వర్తింపజేయాలని వినతి అందించింది. అన్ని వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.