News4th Jul 05:29 PMSunil Byrisetty1 min read

అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు

సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా ముసునూరు మండలం వేలుపుచర్ల లో గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. గ్రామంలోని ఆరు ఎక

అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు
సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో భాగంగా ముసునూరు మండలం వేలుపుచర్ల లో గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. గ్రామంలోని ఆరు ఎకరాలు కొండ పోరంబోకు భూమిని ఇండ్ల స్థలాలు కొరకు అధికారులు, కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఆరు ఎకరాల భూమిని సర్వే చేసి,చదును చేసి ఇండ్ల స్థలాలకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఎంతమందికి ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వవచ్చునని తహశీల్దారును మంత్రి అడగగా 60 మందికి ఇవ్వవచ్చునని తెలిపారు. సర్వే పనులు, లెవిలింగు పనులు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు అందజేయటకు సిద్ధం చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh news
door-to-door TDP program
Minister Kolusu Parthasarathy
suparipalana
Musunur mandal
house plots
అర్హులైన నిరుపేదలకు ఇండ్ల పట్టాలు
Scroll for the next article