News17th Sep 05:10 PMSunil Byrisetty1 min read

19న విశాఖలో ఇళ్ల పట్టాల పండుగ

పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం విశాఖ జిల్లాలో ఒకేరోజు 25,880 పేద కుటుంబాల జీవితాల్లో సంతోషం నింపుతోంది. ఈనెల 19వ తేదీన విశాఖలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ స్థలాల్లో న

19న విశాఖలో ఇళ్ల పట్టాల పండుగ
పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం విశాఖ జిల్లాలో ఒకేరోజు 25,880 పేద కుటుంబాల జీవితాల్లో సంతోషం నింపుతోంది. ఈనెల 19వ తేదీన విశాఖలో సీఎం చంద్రబాబు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు నిర్మించుకున్న 25,880 కుటుంబాలకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు పంపిణీ చేయనున్నారు. ప్రతి ఒక్కరికి కూడు,గుడ్డ, నీడ తప్పనిసరిగా ఉండాలన్న టీడీపీ సిద్దాంతానికి అనుగుణంగా 2024లో ఆంధ్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వివిధ ప్రభుత్వ స్థలాల్లో అభ్యంతరం లేని ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు హక్కులను కల్పించేలా వివిధ రకాల జీవోలను జారీ చేసింది. ఆ జీవోల అమల్లో భాగంగా ఒక్క విశాఖ జిల్లాలోనే 11 మండలాల్లో 25,880 మందికి వారి ఆస్తులపై పూర్తి హక్కులు కల్పిస్తున్నారు. అదే విధంగా రానున్న కాలంలో విజయవాడలోనూ 24 వేల మంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇప్పటికే జీవో నెంబర్ 30 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 12 వేల మందికి వారి ఇంటి స్థలాలపై హక్కులు కల్పించారు. మరో 9 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించనున్నారు.
Andhra Pradesh
Visakhapatnam
Vizag News
House Pattas
House Site Pattas
Chandrababu Naidu
AP Government
Housing Scheme
Land Regularisation
సంక్షేమ పథకాలు
విశాఖపట్నం వార్తలు
ఏపీ వార్తలు
సీఎం చంద్రబాబు
ఆస్తి హక్కులు
కన్వేయన్స్ డీడ్స్
ఏపీ రాజకీయాలు
Scroll for the next article