News19th Apr 09:30 AMSunil Byrisetty1 min read

ప్రతీ పేదకూ సొంతిల్లు.. అదే ప్రభుత్వ లక్ష్యం!

రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇళ్ళు కట్టించటమే ప్రభుత్వ లక్ష్యమని గృహనిర్మాణ శాఖమంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలతో ఇళ్ళు నిర్మించి అందిస్తామ

ప్రతీ పేదకూ సొంతిల్లు.. అదే ప్రభుత్వ లక్ష్యం!
రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇళ్ళు కట్టించటమే ప్రభుత్వ లక్ష్యమని గృహనిర్మాణ శాఖమంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు. ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలతో ఇళ్ళు నిర్మించి అందిస్తామని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన ఎం.శివప్రసాద్ విజయవాడలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి గృహనిర్మాణ శాఖలోని అభివృద్ధి కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. జూన్ నాటికి నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాల పురోగతిని శివప్రసాద్ మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయడానికి అధికారులంతా కృషి చేస్తున్నారని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఏ పేద కుటుంబం ఉండకూడదని మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh
Housing Minister Partha Sarathi
build houses for every poor person
ప్రతి పేదవాడికి ఇళ్ళు
శివప్రసాద్ మంత్రి
జూన్ నాటికి నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాలు
Scroll for the next article