News17th Mar 11:26 AMSunil Byrisetty1 min read
ఏ నీరు మంచిది? ఏవి తాగొచ్చో మీకు తెలుసా?
కాచిన నీరు, కుళాయి నీరు, ఫిల్టర్ చేసిన ఆర్ఓ వాటర్.. వీటిలో ఏ నీరు తాగితే మంచిదనే సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సూచనల
కాచిన నీరు, కుళాయి నీరు, ఫిల్టర్ చేసిన ఆర్ఓ వాటర్.. వీటిలో ఏ నీరు తాగితే మంచిదనే సందేహాలు ఎంతో మందిలో ఉంటాయి. నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సూచనల ప్రకారం నీటిలో ఆమ్లత్వం(పీహెచ్) 6.5 నుంచి 8.5 శాతం మధ్యలో ఉండాలి.
నాణ్యమైన నీటిలో ఆర్గానిక్ సాల్ట్స్, కాల్షియం, మెగ్నీషియం, బైకార్బనైట్స్, క్లోరైడ్స్, సల్ఫైట్స్, కర్బన పదార్థాలు ఉంటాయి.
కాడ్మియం, లెడ్, నికెల్ లోహాలు స్వల్పంగా కరిగి ఉంటాయి.
ఇవన్నీ కలిపి లీటర్ నీటిలో 500 మిల్లీగ్రాములు మించకుండా ఉంటే మంచిది.
అలాగే 100 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి.
ఇక టీడీఎస్ కూడా 100 కన్నా తక్కువ, 500 కన్నా ఎక్కువ ఉంటే తాగేందుకు పనికిరావు.
100 నుంచి 500 మధ్య టీడీఎస్ ఉండే నీరు తాగడానికి మంచివని నిపుణులు చెబుతున్నారు.
నీటిలో ఫ్లోరైడ్స్ మిల్లీగ్రాము దాటితే దంత సమస్యలు, సోడియం ఎక్కువుంటే బీపీ ప్రమాదం ఉంది.
ఎరువుల్లోని నైట్రేట్ నీటిలో కరగడం వల్ల అవి తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయి. కుళాయి ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే నీరు క్లోరినేషన్ చేసి ఉంటాయి.
అయితే అన్ని రకాల వ్యర్థాలు, వైరస్ లు తొలగిపోవు.
ఫిల్టర్ చేసిన నీటిలో కూడా అన్ని వైరస్లు నాశనం కావు.
నీటి కాలుష్యం పెరుగుతున్న పరిస్థితుల్లో వేడి చేసిన ఫిల్టర్ నీటిని తాగడం మంచిది.