National18th Sep 04:29 PMSunil Byrisetty1 min read
పుట్టుమచ్చను పసిగట్టిన జెమిని
నానో బనానా గుట్టు రట్టు చేస్తోంది. గూగుల్ జెమినీకి చెందిన నానా బనానా ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ టూల్ వాడి తమ ఫొటోల్ని వీడియోలుగా, త్రీడీ ఫొటోలుగా
నానో బనానా గుట్టు రట్టు చేస్తోంది. గూగుల్ జెమినీకి చెందిన నానా బనానా ఏఐ టూల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ టూల్ వాడి తమ ఫొటోల్ని వీడియోలుగా, త్రీడీ ఫొటోలుగా మార్చుకుంటున్న యూజర్లకు ఈ క్రమంలో పలు చోట్ల షాకులు తగులుతున్నాయి.కానీ ఈ ట్రెండ్ ఓ యువతికి ఊహించని షాకిచ్చింది. నానో బనానా ఫొటోలో తన పుట్టుమచ్చ చూసుకుని ఆమె షాకైపోయింది. దీని విషయం ఏఐకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయింది. తనకెదురైన అనుభవాన్ని సదరు యువతి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘నేనూ నానో బనానాతో ఓ ఫొటో చేయించుకున్నాను. ఆ ఫొటోలో పుట్టుమచ్చ కనిపించడంతో షాకయిపోయాను. నాకు చేతిపై పుట్టుమచ్చ ఉన్నది నిజమే కానీ నేను అంతకుముందు అప్‌లోడ్ చేసిన ఫొటోలో అది కనిపించకుండా ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి.