Education13th Apr 11:41 AMSunil Byrisetty1 min read

మార్కులపై సంతృప్తి లేదా.. ఇలా చేయండి!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో సంతృప్తి చెందని విద్యార్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు అప్లై చేసుకోవడాని

మార్కులపై సంతృప్తి లేదా.. ఇలా చేయండి!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో సంతృప్తి చెందని విద్యార్థులకు బోర్డు మరో అవకాశం కల్పించింది. రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://bieap.apcfss.in/ లో వివరాలు నమోదు చేయాలి. తర్వాత రీ కౌంటింగ్ లేదా రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న సబ్జెక్ట్‌లను ఎంచుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారం సమర్పించాలి. రీ వాల్యుయేషన్ తర్వాత వచ్చే మార్కులే తుది మార్కులుగా పరిగణించబడతాయి. రీ వాల్యుయేషన్ కోసం అప్లై చేసే విద్యార్థులకు వారి జవాబు పత్రాల స్కానింగ్ కాపీ కూడా అందిస్తారు.
Andhra Pradesh
Inter Results Recounting
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్
రీ వాల్యుయేషన్‌
Scroll for the next article