News16th May 11:12 AMSunil Byrisetty1 min read
రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా? లింకులో చూడండి!
గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నాక.. ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలన జరుగుతుంది. ఆ దశల పూర్తి
గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దరఖాస్తు చేసుకున్నాక.. ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలన జరుగుతుంది.
ఆ దశల పూర్తికి 21 రోజుల సమయం పడుతుంది.
ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతిని ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటును దరఖాస్తుదారులకు కూటమి ప్రభుత్వం కల్పించింది.
https://vswsonline.ap.gov.in/వెబ్‌సైట్‌లో లాగిన్ అయితే.. ఏపీ సేవా అధికారిక పోర్టల్ వస్తుంది.
కుడి వైపున పైన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సెర్చ్ గడియ ఉంటుంది.
అందులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది.
తర్వాత ఓ కోడ్ వస్తుంది...ఆ వివరాలు అందులో పొందుపరిస్తే.. రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి వద్ద ఉందో తెలిసిపోతుంది.
ప్రక్రియ ఎన్ని రోజుల్లోపు పూర్తవుతుంది వంటి వివరాలు కనిపిస్తాయి.