Mobiles6th Jul 11:11 AMSunil Byrisetty1 min read
ఫోన్ హ్యాకైందని డౌటా.. ఇలా చేయండి!
నేటి సమాజంలో ప్రతి ఒక్క పని స్మార్ట్ ఫోన్‌తోనే జరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం సహా లావాదేవీలన్నీ ఫోన్‌లోనే జరిగిపోతున్నాయి. అలాగే వ్యక్తిగత వివరాలూ ఫోన్‌లోనే దాచేస్తున్న
నేటి సమాజంలో ప్రతి ఒక్క పని స్మార్ట్ ఫోన్‌తోనే జరుగుతున్నాయి. బ్యాంక్ ఖాతాలను లింక్ చేయడం సహా లావాదేవీలన్నీ ఫోన్‌లోనే జరిగిపోతున్నాయి. అలాగే వ్యక్తిగత వివరాలూ ఫోన్‌లోనే దాచేస్తున్నారు. అంతటి కీలకమైన సమాచారం ఉన్న ఫోన్ హ్యాకింగైతే నష్టాన్ని భరించడం ఎవరి వల్లా సాధ్యం కాదు. కనుక స్మార్ట్ ఫోన్ హ్యాకర్ల బారిన పడిందా అన్న సందేహాలున్నా, హ్యాకర్ల బారిన పడకుండా చూసుకోవాలంటే ఇలా చేయాలి. ఏ యాప్‌నైనా సరే గూగుల్ ప్లే స్టోర్ లేదా ఐఫోన్ అయితే యాపిల్ స్టోర్ లేదా అధికారిక వెబ్ సైట్ల ద్వారా మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోన్ ఓఎస్, ఇతర యాప్‌లు నిత్యం అప్‌డేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఔట్‌డేటెడ్ యాప్స్, ఉపయోగించని యాప్స్, యాక్సెస్ అడిగే యాప్స్‌ను తొలగించడం మంచిది. ఏపీకే ఫైల్స్ ద్వారా యాప్స్ ఎట్టి పరిస్థితుల్లో డౌన్‌లోడ్ చేసుకోవద్దు. అనుమతి లేకుండా ఫోన్‌ను ఎవరూ చూడకుండా పాస్‌వర్డ్స్, పిన్స్, లేదా బయోమెట్రిక్‌తో లాక్ చేసుకోవాలి. అలాగే యాంటీవైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా మాల్‌వేర్‌లను అడ్డుకుని ముప్పును తప్పిస్తుంది. ఇంకా బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫై నెట్‌వర్క్‌ను వాడుకోకపోవడం ద్వారా హ్యాకర్ల నుంచి మన ఫోన్‌ను భద్రంగా ఉంచుకోవచ్చు.