Electronics6th Jun 03:45 PMSunil Byrisetty1 min read

ఈ ల్యాప్ టాప్.. బ్యాటరీ కా బాప్!

ప్రముఖ కంప్యూటర్ తయారీ కంపెనీ HP ఇండియాలో కొత్త ల్యాప్ టాప్ లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ల్యాప్ టాప్ ఏకంగా 34 గంటల బ్యాటరీ లైఫ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు చెబుతున్నారు. హెచ్‌పీ ఓమ

ఈ ల్యాప్ టాప్.. బ్యాటరీ కా బాప్!
ప్రముఖ కంప్యూటర్ తయారీ కంపెనీ HP ఇండియాలో కొత్త ల్యాప్ టాప్ లాంచ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ ల్యాప్ టాప్ ఏకంగా 34 గంటల బ్యాటరీ లైఫ్ సపోర్ట్ తో అందిస్తున్నట్లు చెబుతున్నారు. హెచ్‌పీ ఓమ్ని బుక్ 5 సిరీస్‌గా రాబోయే ఈ ల్యాప్ టాప్ Next Gen AI PC గా అందించింది. అయితే, హెచ్‌పీ అప్ కమింగ్ ల్యాప్ టాప్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ హెచ్‌పీ బుక్ 5 ల్యాప్ టాప్‌ని చాలా స్లీక్ డిజైన్‌తో అందిస్తోంది. అయితే, ఇది లాంగ్ బ్యాటరీ, పావుర ఫుల్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ క్వాల్కమ్ Snapdragon X1-26-100 ప్రాసెసర్‌తో లాంచ్ చేస్తోంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్, HP AI కంపానియన్, Copilot+PC తో వస్తుంది. ఇది సెకనుకు 45 ట్రిలియన్ ఆపరేషన్ నిర్వహించే శక్తిని కలిగి ఉంటుందని చెబుతోంది. ఈ హెచ్‌పీ ల్యాప్ ట్యాప్ 300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 14 ఇంచ్ మైక్రో ఎడ్జ్ OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. 2K రిజల్యూషన్ స్క్రీన్ కలిగి గొప్ప విజువల్స్ అందిస్తుందని హెచ్‌పీ తెలిపింది. ఇందులో 34 గంటల సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కేవలం 30 నిమిషాల ఛార్జ్ తో 50% వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుందని హెచ్‌పీ చెబుతోంది.
Laptop
HP omni Book 5
34 hours long battery life fast processor
Copilot+PC
34 గంటల బ్యాటరీ లైఫ్ సపోర్ట్
గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ HP ఇండియాలో కొత్త ల్యాప్ టాప్ లాంచ్
Scroll for the next article