Electronics8th Jun 08:03 PMSunil Byrisetty1 min read
హువావే స్మార్ట్ బ్యాండ్.. ఒక్క చార్జ్‌తో రెండు వారాలు!
టెక్ దిగ్గజ సంస్థ హువావే, సరికొత్త స్మార్ట్ బ్యాండ్ 'హువావే బ్యాండ్ 10'ను విడుదల చేసింది. ఈ బ్యాండ్ పాలిమర్, అల్యూమినియం అలాయ్ కేస్‌తో స్టైలిష్ డిజైన్‌తో వచ్చేసింది. ఒక్కసారి ఛార్
టెక్ దిగ్గజ సంస్థ హువావే, సరికొత్త స్మార్ట్ బ్యాండ్ 'హువావే బ్యాండ్ 10'ను విడుదల చేసింది. ఈ బ్యాండ్ పాలిమర్, అల్యూమినియం అలాయ్ కేస్‌తో స్టైలిష్ డిజైన్‌తో వచ్చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వారాలపాటు బ్యాటరీ పని చేస్తుందని హువావే చెబుతోంది. హువావే బ్యాండ్ 10 పాలిమర్ కేస్ ధర రూ. 6,499 కాగా, అల్యూమినియం అలాయ్ బాడీ రూ. 6,999గా ఉంది. జూన్ 10 వరకు లాంచ్ ఆఫర్‌గా పాలిమర్ కేస్ వెర్షన్ రూ. 3,699కు, అల్యూమినియం వెర్షన్ రూ. 4,199కే అందుబాటులో ఉంది. అమెజాన్ ద్వారా ఈ హువావే బ్యాండ్ 10 బ్లాక్, పింక్ ఆప్షన్లు పాలిమర్ కేస్‌లో, బ్లూ, గ్రీన్, మ్యాట్ బ్లాక్, పర్పుల్, వైట్ రంగుల్లో అల్యూమినియం కేస్ ఉన్నాయి. 1.47-అంగుళాల అమోలెడ్ దీర్ఘచతురస్రాకార డిస్‌ప్లేతో, 194x368 పిక్సెల్స్ రిజల్యూషన్, 282ppi పిక్సెల్ డెన్సిటీ, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ బ్యాండ్‌లో 100 ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లు ఉన్నాయి. స్విమ్మింగ్ చేసేవారికి ఇది గొప్ప ఎంపిక అని హువావే చెబుతోంది. గరిష్టంగా 14 రోజుల వరకు పనిచేసే ఈ బ్యాండ్ ఛార్జ్ అవడానికి 45 నిమిషాలు పడుతుంది.