Mobiles30th Nov 11:37 AMSunil Byrisetty1 min read
హువావె నుంచి కొత్త 5g స్మార్ట్ ఫోన్
హువావె నుంచి కొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్, Enjoy 70x Premium Edition మార్కెట్లోకి విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ కిరిన్ 8000 ప్రాసెసర్, 50MP కెమెరా, 6100mAh బ్యాటరీతో పాటు 40W ఫ
హువావె నుంచి కొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్, Enjoy 70x Premium Edition మార్కెట్లోకి విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ కిరిన్ 8000 ప్రాసెసర్, 50MP కెమెరా, 6100mAh బ్యాటరీతో పాటు 40W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ తో చైనాలో వచ్చింది. అలాగే 8GB ర్యామ్, 256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లతో వస్తున్న ఈ ఫోన్ ధర సుమారు రూ. 24 వేల నుంచి మొదలవుతుంది. చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన Huawei, తమ కొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన Huawei Enjoy 70x Premium Edition ని చైనా మార్కెట్ లోకి విడుదల చేయడం జరిగింది. అలాగే ఇది 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 6100 ఎంఏహెచ్ బ్యాటరీ, 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, హార్మొనీ ఓఎస్ 4.2 వంటి ఫీచర్స్ తో అందుబాటులోకి వచ్చింది. మరొకవైపు ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే 2 వేరియంట్స్ తో అందుబాటులోకి రావడం జరిగింది. ధర విషయానికి వస్తే, బేస్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర 1899 చైనీస్ యువాన్స్ అనగా మన దేశ కరెన్సీలో సుమారు రూ. 24,000 లుగా, అలాగే 8 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర 2199 చైనీస్ యువాన్స్ అనగా మన దేశ కరెన్సీలో సుమారు రూ. 27,700 లుగా కంపెనీ నిర్ణయించింది.