News14th Jan 05:04 PMSunil Byrisetty1 min read
బకాయిలు కొండంత... చెల్లింపులు గోరంత!
పి.ఆర్.సి అమలు, మద్యంతర భృతి మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు వంటి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర (ఎస్.టి.యు) ఆధ్వర్యంలో దశలవారి ఉద్యమం చేపడుతున్నట్టు రాష
పి.ఆర్.సి అమలు, మద్యంతర భృతి మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు వంటి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం.ఆం.ప్ర (ఎస్.టి.యు) ఆధ్వర్యంలో దశలవారి ఉద్యమం చేపడుతున్నట్టు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ రెడ్డి,ఎల్.సాయి శ్రీనివాస్ తెలిపారు. సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని, ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తామని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యంతర భృతి ప్రకటిస్తామని, ఆర్థిక బకాయిల చెల్లింపుకు ఏర్పాటు చేస్తామని, పెన్షనర్లకు పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయినా ఏ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదన్నారు. సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదన్నారు. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై నిర్ణయం తీసుకోకుండా సమాచారం తీసుకోవడంతోనే సరిపుచ్చుతున్నారన్నారు. 2023 జూలై నుండి అమలు కావలసిన పన్నెండవ పిఆర్సి కొరకు కమిటీ ఏర్పాటు పై సాచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 12వ పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు.