News1st Jun 05:51 PMSunil Byrisetty1 min read
ప్యూర్ విజన్ నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
విజయవాడ పరిధిలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. భవానిపురం ఎన్డీఏ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది
విజయవాడ పరిధిలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. భవానిపురం ఎన్డీఏ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్యూర్ విజన్ కంటి ఆస్పత్రి వైద్య బృందం నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 120 మందికి నేత్ర పరీక్షలు చేశారు.
అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
కంటి చూపు మందగించిన వారికి కళ్లద్దాలను తక్కువ ధరకే అందజేసినట్లు ప్యూర్ విజన్ మార్కెటింగ్ ఆఫీసర్ స్వరాజ్యరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ రాయపూడి అనిల్, ప్యూర్ విజన్ సిబ్బంది పాల్గొన్నారు.