Health18th Mar 01:24 PMSunil Byrisetty1 min read

కరోనాను మించిన హ్యుమన్ కరోనా.. జాగ్రత్త!

కోవిడ్ 19 అలియాస్ కరోనా వైరస్. ఈ పేరు చెబితే ఇప్పటికీ ఎంతో మంది ఉలిక్కి పడతారు. లాక్ డౌన్ బాధలు, వ్యాక్సిన్ వెతలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడు కొత్తగా గుర్తించిన

కరోనాను మించిన హ్యుమన్ కరోనా.. జాగ్రత్త!
కోవిడ్ 19 అలియాస్ కరోనా వైరస్. ఈ పేరు చెబితే ఇప్పటికీ ఎంతో మంది ఉలిక్కి పడతారు. లాక్ డౌన్ బాధలు, వ్యాక్సిన్ వెతలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడు కొత్తగా గుర్తించిన వేరియంట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో మరో కొత్త వేరియంట్‌ భయాందోళనకు గురి చేస్తోంది. కోల్‌కతాలో 45 ఏళ్ల మహిళకు సోమవారం హ్యూమన్ కరోనా వైరస్ HKU1 సోకినట్లు నిర్ధారించారు. ఆ మహిళ గత 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండటంతో టెస్టులు చేయగా అత్యంత అరుదైన ‘హ్యూమన్‌ కరోనా వైరస్‌’ (హెచ్‌కేయూ1) ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను ఐసొలేషన్‌ ఉంచారు. అయితే ఈ వైరస్ కు అంతగా భయపడనక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది కరోనా లాగా మహమ్మారిగా మారే అవకాశం లేదంటున్నారు.
Human Corona
vaccine
HKU1
ప్రపంచవ్యాప్తంగా
Scroll for the next article