News9th Dec 04:21 PMSunil Byrisetty1 min read
‘సమాజంలో మానవత్వం తగ్గిపోతోంది’: హోం మంత్రి అనిత
రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీ-3’ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనాధ బాలికలకు విద్య అందించే ఈ కార్యక్రమాన్ని, లేడీస్ సర
రౌండ్ టేబుల్ ఇండియా విజయవాడ లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీ-3’ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనాధ బాలికలకు విద్య అందించే ఈ కార్యక్రమాన్ని, లేడీస్ సర్కిల్ సేవలను ఆమె అభినందించారు. “సమాజంలో మానవత్వం, సేవా భావం తగ్గిపోతోంది. ప్రమాదాలు జరిగితే సాయం చేయకుండా రీల్స్ తీస్తున్నారు. చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. టెక్నాలజీని నేరాలకు వాడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రతి మహిళకు చట్టాలపై అవగాహన ఉండాలని, సక్రమంగా వినియోగిస్తే నేరాలు తగ్గుతాయని హితవు పలికారు. మహిళల భద్రత అత్యంత అవసరమని ఒత్తిడి చేశారు. “విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన 2020 విజన్ ఈరోజు హైదరాబాద్‌లో కనిపిస్తోంది. పీ4, పీపీపీ విధానాలతో పేదలకు సేవలు, రాష్ట్రానికి అభివృద్ధి అందుతోంది. ప్రతి మంచి పనికీ ప్రభుత్వం అండగా ఉంటుంది” అని అనిత అన్నారు.