News8th Aug 09:00 AMSunil Byrisetty1 min read
భార్య పేకాటపై.. భర్త ఫిర్యాదు!
తన భార్య రోజూ పేకాట ఆడుతుందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా మగవాళ్ళు పేకాట ఆడితే ఇంట్లో మహిళలు పోరు పెడుతుంటారు. విశాఖలో కథ చిత్రంగా అందుకు భిన్నంగా ఉంది. వైజాగ్ లలి
తన భార్య రోజూ పేకాట ఆడుతుందని ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాధారణంగా మగవాళ్ళు పేకాట ఆడితే ఇంట్లో మహిళలు పోరు పెడుతుంటారు. విశాఖలో కథ చిత్రంగా అందుకు భిన్నంగా ఉంది. వైజాగ్ లలిత్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళల వ్యవహారాన్ని ఒక మహిళ భర్త బట్టబయలు చేశాడు.
భర్త ఫిర్యాదుతో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు.