Telangana5th Dec 03:20 PMSunil Byrisetty1 min read
సర్పంచ్ కోసం ఇద్దరు భార్యలతో నామినేషన్లు
తెలంగాణ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించిన ఓ భర్త గొప్పఇరకాటంలో పడ్డాడు. పలు చోట్ల సర్పంచ్ పదవికి నామినేషన్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్
తెలంగాణ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించిన ఓ భర్త గొప్పఇరకాటంలో పడ్డాడు. పలు చోట్ల సర్పంచ్ పదవికి నామినేషన్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నవంబర్ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు వేయించారు. నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్రూ్కటినీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో రెండో భార్యతో మరో నామినేషన్ వేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఈ ఇద్దరే పోటీలో ఉన్నారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం కానుంది. దీంతో ఏ భార్యను సర్పంచ్ చేయాలో, ఎవరిని ఉపసంహరించుకోమనాలో అర్థం కాని సందిగ్ధంలో ఆ భర్త పడ్డాడు.