Telangana28th Jan 11:48 AMSunil Byrisetty1 min read

మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్

మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్ అయ్యారు. ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు ఊర్మిళ పోగొట్టుకున్నారు. ఊర్మిళ వాట్సప్ నంబరు

మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్
మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్యను మోసం చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్ట్ అయ్యారు. ట్రేడింగ్ మీద అవగాహన లేక భర్త సహాయం తీసుకొని రూ.2.58 కోట్లు ఊర్మిళ పోగొట్టుకున్నారు. ఊర్మిళ వాట్సప్ నంబరుకు గత ఏడాది నవంబర్ నెలలో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఒక లింక్ వచ్చింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే 500 రెట్లు ఆదాయం వస్తుందని ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు డిసెంబర్ 24 నుండి జనవరి 5 వరకు 19 విడతలుగా రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు. 2 కోట్ల రూపాయల లాభం వచ్చినట్లుగా సైబర్ నేరగాళ్లు నమ్మించారు. విత్ డ్రా చేసుకోవాలంటే మరికొంత సొమ్ము చెల్లించాలని చెప్పడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేరానికి పాల్పడ్డ బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన నలుగురు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Cyber Crime
Online Fraud
Trading Scam
Stock Market Fraud
WhatsApp Scam
Hyderabad
మాజీ జేడీ లక్ష్మీనారాయణ
పెట్టుబడి మోసం
బీహార్ నిందితులు
పశ్చిమ బెంగాల్ నిందితులు
Scroll for the next article