Telangana1st Jul 10:38 AMSunil Byrisetty1 min read
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జర్మనీ-హాంబర్గ్‌లో ఇటీవల జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. జర్మనీ-హాంబర్గ్‌లో ఇటీవల జరిగిన 'ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్' (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌కి ప్రత్యేక గుర్తింపు కల్పించారు. ఆర్టీఏ తోడ్పాటుతో 'ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్స్ లీడింగ్ టు ఇన్‌క్రీజ్డ్ రెవెన్యూ ఫర్ ట్రెయిన్' ప్రాజెక్టుకు గాను పురస్కారం ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో సంస్థ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి వెల్లడించారు.