Telangana28th Sep 03:30 PMSunil Byrisetty1 min read
విజయవంతమైన పింక్ పవర్ రన్
స్ట్రైడ్ అండ్ షైన్ నినాదంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఫౌండేషన్, సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఆదివారం బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన
స్ట్రైడ్ అండ్ షైన్ నినాదంతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఫౌండేషన్, సుధారెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఆదివారం బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పింక్ పవర్ మారథాన్ రన్ విజయవంతమైంది. చిన్నారుల నుంచి వృద్ధులు, వికలాంగుల వరకు వేల సంఖ్యలో ఈ రన్ లో తాము సైతం అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పింక్ పవర్ రన్ లో పాల్గొనే వారి రాకతో నెక్లెస్ రోడ్ పరిసరాలు సందడి సందడిగా కనిపించాయి. రన్ లో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి ఒక్కరు పింక్ రంగు టి షర్ట్స్ ను ధరించటంతో ఈ ప్రాంతం అంతా పింక్ మయం ఐంది. పింక్ పవర్ రన్ నిర్వాహకులు ఎం ఈ ఐ ఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్లు సుధా రెడ్డి, పీవీ కృష్ణారెడ్డి, మిస్ వరల్డ్, వివిధ ఉపఖండాల సుందరీమణులు , ప్రపంచ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం, సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులు జయేష్ రంజన్, దాసరి హరిచందన, సీనియర్ ఐపీఎస్ అధికారి తరుణ్ జోషితోపాటు పలువురు అధికార, అనధికార ప్రముఖులు ఈ రన్ లో భాగస్వాములు అయ్యారు. తొలుత 10 కిలోమీటర్లు, అనంతరం ఐదు కిలోమీటర్లు, చివరగా మూడు కిలోమీటర్ల పరుగును నిర్వహించారు.