News3rd Jun 06:41 PMSunil Byrisetty1 min read

డ్రగ్స్ దందాలో ఏపీ కానిస్టేబుల్‌!

డ్రగ్స్ దందాలో ఏపీ కానిస్టేబుల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రూ.2 కోట్ల విలువైన డ్రగ

డ్రగ్స్ దందాలో ఏపీ కానిస్టేబుల్‌!
డ్రగ్స్ దందాలో ఏపీ కానిస్టేబుల్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా గుర్తించారు. మొత్తం ఆరుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ కానిస్టేబుల్ నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఓటీ అధికారులు తెలిపారు. తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి ముఠాగా డ్రగ్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు.
Andhra Pradesh news
Telangana polices
arrest ap constable
Smuggling drugs
ఏపీ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
2 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
Scroll for the next article