Telangana29th Oct 01:47 PMSunil Byrisetty1 min read

డీప్‌ఫేక్ మోసాలకు 'సేఫ్ వర్డ్'.. సజ్జనార్ కీలక సూచన

టెక్నాలజీ సాయంతో విస్తరిస్తున్న డీప్‌ఫేక్ మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి మనకు తెలిసిన వారి ముఖం,

డీప్‌ఫేక్ మోసాలకు 'సేఫ్ వర్డ్'.. సజ్జనార్ కీలక సూచన
టెక్నాలజీ సాయంతో విస్తరిస్తున్న డీప్‌ఫేక్ మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి మనకు తెలిసిన వారి ముఖం, గొంతును సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు 'సేఫ్ వర్డ్' (రహస్య పదం) ఒకటే సురక్షితమైన మార్గమని ఆయన సూచించారు. ఈ డీప్‌ఫేక్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ముందుగానే ఒక 'సేఫ్ వర్డ్' లేదా రహస్య కోడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు తెలిసిన వారి నంబర్ నుంచి గానీ, కొత్త నంబర్ నుంచి గానీ కాల్ వచ్చి డబ్బు అడిగితే, ముందుగా ఆ సేఫ్ వర్డ్‌ను చెప్పమని అడగాలి. వారు సరైన పదం చెప్పలేకపోతే అది మోసపూరిత కాల్ అని గుర్తించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాస్తవాలు నిర్ధారించుకోకుండా డబ్బు పంపవద్దని ఆయన స్పష్టం చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, కేవలం రూపం, స్వరం చూసి మోసపోవద్దని సజ్జనార్ హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి డీప్‌ఫేక్ కాల్స్ చేసి డబ్బులు అడిగితే, వెంటనే మోసమని గ్రహించి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
Telangana
Deep fake Scam
CyberySafety
Safe word
Hyderabad Police
VC Sajjanar
AI Fraud
Cyber Crime
Online Safety
Digital Security
డీప్‌ ఫేక్‌ మోసం
డిజిటల్‌ సెక్యూరిటీ
Scroll for the next article