Technology24th Aug 05:08 PMSunil Byrisetty1 min read
ఏఐ ఆధారిత సేవలకు హబ్‌గా హైదరాబాద్
అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలతో అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్ హైదరాబాద్ కార్యాలయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమా
అంతర్జాతీయ న్యాయ నైపుణ్యాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలతో అనుసంధానిస్తూ ఏర్పాటు చేసిన కావేటి ఇంటర్నేషనల్ ఏఐ ఫర్మ్ హైదరాబాద్ కార్యాలయాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. వివిధ వృత్తిపరమైన రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, దీనివల్ల అపారమైన అవకాశాలతో పాటు సాంకేతికతను బాధ్యతాయుతంగా, నైతికంగా, పారదర్శకంగా వినియోగించాల్సిన అవసరం కూడా ఏర్పడుతోందని అన్నారు. బలమైన టెక్నాలజీ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అంతర్జాతీయ అనుసంధానం వంటి ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ఉన్నాయని తెలిపారు. వీటి ఆధారంగా ఏఐ ఆధారిత ప్రొఫెషనల్, న్యాయ సేవలకు హైదరాబాద్‌ను కీలక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణను అంతర్జాతీయ నిపుణులతో అనుసంధానించే ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకువస్తాయని పేర్కొన్నారు.