News12th Oct 04:35 PMSunil Byrisetty1 min read

హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు.. విశాఖకు పదేళ్లు!

ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని, 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో మొదటి

హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు.. విశాఖకు పదేళ్లు!
ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని, 2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన అనంతరం రిషికొండలోని ఏ1 గ్రాండ్ కన్వెన్షన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఇక్కడున్న ఐటీ ప్రొఫెషనల్స్ కు, సీఈవోలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 1990ల్లో పలు ఐటీ సంస్థలు హైదరాబాద్ కు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ టవర్స్ ను నిర్మించారన్నారు. దీనివల్ల అనేక సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయని, హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పైనే పట్టిందని వివరించారు. కానీ విశాఖకు పదేళ్లకు మించి పట్టదన్నారు. పెట్టుబడుల కోసం ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతోనే కాదు.. ఇతర దేశాలతో పోటీపడుతున్నామని చెప్పారు.
Andhra Pradesh
Visakhapatnam
Hyderabad
Nara Lokesh
Andhra Pradesh
economic capital
trillion dollar economy
AI data center
cable landing station
IT development
Scroll for the next article