News12th Oct 04:11 PMSunil Byrisetty1 min read
రాజధానులని కలిపే గేమ్-ఛేంజర్ ప్రాజెక్టు.!
తెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్- విజయవాడ మధ్య గేమ్ ఛేంజర్ లాంటి రహదారి విస్తరణ జరగనుంది. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గబోతోంది. 6-7 గంటల సమయాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకునేలా ఒ
తెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్- విజయవాడ మధ్య గేమ్ ఛేంజర్ లాంటి రహదారి విస్తరణ జరగనుంది. దీంతో
ప్రయాణ సమయం భారీగా తగ్గబోతోంది. 6-7 గంటల సమయాన్ని కేవలం 2 గంటల్లోనే చేరుకునేలా ఒక బృహత్తర ప్రాజెక్టు శరవేగంగా ముందుకు కదులుతోంది. రెండు నగరాల మధ్య కొత్త 6-లేన్ల హైవే నిర్మించడం ద్వారా రెండు నగరాల మధ్య దూరం కేవలం 2 రెండు గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు. సాధారణంగా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో 235 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే, ఇది ఈ ప్రాంత కనెక్టివిటీకి ఒక గేమ్ ఛేంజర్ గా మారనుంది.
ప్రస్తుతం విజయవాడ – హైదరాబాద్ మధ్య NH 65 ఉంది. ఇది నాలుగు లేన్ల రహదారి. దీన్ని 6 లేన్లకు విస్తరించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు దీనికి మోక్షం కలుగుతోంది. ఈ జాతీయ రహదారిని 6 లేన్లకు విస్తరించడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని ప్రమాదరహితంగా తీర్చిదిద్దనున్నారు. 2 గంటల్లో ప్రయాణం సాధ్యమయ్యేలా యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ ప్రెస్ హైవేని నిర్మిస్తారు. అంటే ఇరువైపులా కంచె వేసి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తారు. తద్వారా గరిష్ట వేగం సాధ్యమవుతుంది.