Telangana4th Oct 10:10 AMSunil Byrisetty1 min read
కొండాపూర్లో పంజా విసిరిన హైడ్రా
హైదరాబాద్లో ఆక్రమిత ప్రదేశాలను విడిపించే దిశగా హైడ్రా పంజా విసురుతోంది. కొండాపూర్లో మరోసారి హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య 36 ఎకర
హైదరాబాద్లో ఆక్రమిత ప్రదేశాలను విడిపించే దిశగా హైడ్రా పంజా విసురుతోంది.
కొండాపూర్లో మరోసారి హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. ఉదయం నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య 36 ఎకరాల్లో నిర్మాణాలు కూల్చివేశారు. సర్వే నెంబర్ 59లో ఉన్న 36 ఎకరాల స్థలాన్ని 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూల్చివేతల విషయం తెలిసిన స్థానికులు భారీగా అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. అయితే హైకోర్టు సైతం హైడ్రాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకునే దిశగా హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది.