News19th Apr 05:14 PMSunil Byrisetty1 min read

టీడీపీ ఎమ్మెల్యేకి హైడ్రా షాక్!

ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకి హైడ్రా షాకిచ్చింది. తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా పని చేస్తోంది. తాజాగా హైదరాబాద్ హఫీజ్ పేటలో 17 ఎ

టీడీపీ ఎమ్మెల్యేకి హైడ్రా షాక్!
ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకి హైడ్రా షాకిచ్చింది. తెలంగాణలో అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా పని చేస్తోంది. తాజాగా హైదరాబాద్ హఫీజ్ పేటలో 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. అందులో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు చెందిన కార్యాలయాన్నీ కూల్చివేయడం సంచలనంగా మారింది. అయితే దీనిపై స్పందించిన వసంత కృష్ణ ప్రసాద్ 2005లో ఈ భూమిని కొనుగోలు చేశామన్నారు. ఈ ల్యాండ్‌పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించామని, అయినా హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని టీడీపీ ఎమ్మెల్యే వసంత చెబుతున్నారు.
Hydra commission
MLA Vasantha krishnaprasad
farmhouse
ఏపీ టీడీపీ ఎమ్మెల్యేకి హైడ్రా
సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్
మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌
Scroll for the next article