News14th Sep 11:37 AMSunil Byrisetty1 min read
డయేరియా ప్రాంతంలో హైజీన్ కిట్లు!
విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటికే హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. సబ్బులు, హ్యాండ్ వాష్, పినాయిల్, 10 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నామన్
విజయవాడ రాజరాజేశ్వరిపేటలో ప్రతి ఇంటికే హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. సబ్బులు, హ్యాండ్ వాష్, పినాయిల్, 10 ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నామన్నారు. ప్రత్యేక కరపత్రాలతో డయేరియాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
వైద్య శిబిరంలో, ఆసుపత్రిలోనూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేసుల ట్రాకింగ్, ట్రీట్మెంట్ విషయంలో ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని, ఏ సహాయం కావాలన్నా, సమాచారం కావాలన్నా కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ (91549 70454) నంబరుకు కాల్ చేయవచ్చని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.