Politics7th Sep 03:57 PMSunil Byrisetty1 min read
సీఎం అభ్యర్థి నేను కాదు.. విజయసాయి
తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండటం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా అ
తాను స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండటం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా అని ప్రశ్నించారు. రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పరిపాలించాలా అనడిగారు. రాష్ట్రంలో రెడ్లు, కమ్మ వాళ్ళు మాత్రమే కాదు.. చాలా కులాలు, బీసీల్లో 140 కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు మొత్తం 6 కోట్ల మంది ప్రజానీకం ఉన్నారని చెప్పారు. ప్రధానమైన కులాల్లో రెడ్డి, కమ్మ కాకుండా, కాపులు ఉన్నారు, వెలమలు ఉన్నారు. కాపులు, వెలమలు, బీసీవర్గాలు, రజకులు, ఎస్సీలు సీఎం కాలేదే అని ప్రశ్నించారు. వాళ్ళను అణగదొక్కుతూ, ఈ రెండు వర్గాలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయని, పదవులను ఆక్రమించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.