Entertainment23rd Nov 03:08 PMSunil Byrisetty1 min read
కళ్యాణ్‌ను ఎన్ కౌంటర్ చేస్తే తెలుస్తుంది
ఐబొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పుబట్టారు. సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఘాటుగా కౌంటర్
ఐబొమ్మ రవిని ఎన్ కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు తప్పుబట్టారు. సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారని చెప్పారు. తాను 45 పైసలతో సినిమా చూశానని.. ఇప్పుడు దారుణంగా రేట్లు పెరిగాయని వ్యాఖ్యానించారు. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారని నిలదీశారు. తన కొడుకు తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తానని అప్పారావు అన్నారు.