News29th Nov 12:02 PMSunil Byrisetty1 min read

మారిపోయా.. అప్పుడు డబ్బు కోసమే తప్పు చేశా

‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తనకు విదేశీ పౌరసత్వం ఉండటంతో పైరసీ గుట్టు బయటపడినా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్

మారిపోయా.. అప్పుడు డబ్బు కోసమే తప్పు చేశా
‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవి పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తనకు విదేశీ పౌరసత్వం ఉండటంతో పైరసీ గుట్టు బయటపడినా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించినట్లు రవి అంగీకరించినట్లు తెలిసింది. గత ఆరేళ్లుగా తనను ఎవరూ పట్టుకోలేకపోవడంతో, అదే ధీమాతో తన నెట్‌వర్క్‌ను దేశ విదేశాల్లో బలోపేతం చేశానని విచారణలో వెల్లడించాడు. "మొదట్లో కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో చేశాను. చేస్తున్నది తప్పని గుర్తించలేకపోయాను" అంటూ పోలీసుల ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం. జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తిగా మారిపోతానని, మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని పోలీసులను వేడుకున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు మరింత కూపీలాగి, అన్ని వివరాలతో కోర్టు ముందుంచనున్నారు.
iBomma
Piracy
Cyber Crime
Police Custody
Ravi
Telugu Movies
Investigation
Court Case
Scroll for the next article