News5th Sep 05:50 PMSunil Byrisetty1 min read
రిటైరయ్యే వయసొచ్చేసిందన్న స్పీకర్
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. మున్ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన వయస్సు 70 ఏళ్లకు చేరుకు
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. మున్ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన వయస్సు 70 ఏళ్లకు చేరుకుందని, ఇక నిరంతరం ప్రజల్లో తిరగడం, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం చేయలేనన్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఇకపై ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి తెలుగుదేశం కోసం అంకితభావంతో పనిచేశానని గుర్తు చేసుకున్నారు. స్పీకర్ గా మిగిలిన ఈ మూడేళ్లలో రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, ప్రాంతీయ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. ఫైర్ బ్రాండ్ గా, ఏదైనా కుండ బద్దలు కొట్టే నాయకుడిగా పేరున్న అయ్యన్న కుమారుడు విజయ్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.