Politics19th Oct 05:31 PMSunil Byrisetty1 min read

ముందే కూసిన కోయిల.. హోం మంత్రిగా అంబటి

వైసీపీలో కోయిల ముందే కూసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో కాబోయే హోమ్ మంత్రి తానే అంటూ ప్రకటించేశారు. గుంటూరు వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న అంబటి రాంబాబు తన నియోజ

ముందే కూసిన కోయిల.. హోం మంత్రిగా అంబటి
వైసీపీలో కోయిల ముందే కూసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో కాబోయే హోమ్ మంత్రి తానే అంటూ ప్రకటించేశారు. గుంటూరు వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న అంబటి రాంబాబు తన నియోజకవర్గం నుంచి వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ ర్యాలీ తో బయలుదేరారు. మార్గ మధ్యలో పోలీసులు అంబటిని అడ్డుకోవడంతో తనను అడ్డుకున్న పోలీస్ అధికారులను ఉద్దేశించి రాంబాబు రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, ఆ ప్రభుత్వంలో మొదటి ఆరు నెలలు తానే హోమ్ మంత్రినంటూ ప్రకటించుకున్నారు. ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉన్నాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదలుకుని ఆ పార్టీ లోని నాయకులు, కార్యకర్తలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే జగన్ 2.0 అధికారంలోకి వస్తే సీఎం జగన్ హోమ్ మంత్రిగా అంబటి రాంబాబు అవుతారా, అసలు వైసీపీ గెలుస్తుందా అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
Scroll for the next article