News15th Oct 03:13 PMSunil Byrisetty1 min read
త్వరలో తెలుగు నేర్చుకుంటా: రాష్ట్రపతి
అమరావతి- జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రసంగించారు. దేవీ శరన్నవరాత్రుల వేళ, కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ సరస్ మేళా ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఢిల్లీ
అమరావతి- జాతీయ సరస్ మేళా 2026 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ ప్రసంగించారు. దేవీ శరన్నవరాత్రుల వేళ, కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ సరస్ మేళా ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. ఢిల్లీ వెలుపల తొలిసారిగా స్వయం సహాయ సంఘాల జాతీయ సరస్ మేళను ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్ధికంగా సాధికారిత సాధించేలా ప్రధాని మోదీ ప్రత్యేకంగా చర్యలు చేపట్టారని చెప్పారు. ఏపీ ఒడిశా రాష్ట్రానికి పక్కనే ఉన్నప్పటికీ తెలుగు భాషలో మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తెలుగు భాషను కూడా నేర్చుకుని మీతో మాట్లాడేందుకు వస్తానని హామీ ఇచ్చారు.