News23rd Sep 04:24 PMSunil Byrisetty1 min read
బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడతా
గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపరుపు బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ
గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపరుపు బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్లో దేవదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని ఆలా నిర్వీర్యం చేసినా బ్రాహ్మణ కార్పొరేషన్ ను తిరిగి అన్ని పథకాలతో పునరుద్ధరిస్తామని చెప్పారు. గతంలో ఎవరూ బ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకున్నవారు లేరని, ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణుల సంక్షేమాన్ని మానిఫెస్టోలో పెట్టారని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. వెనుకబడిన తరగతుల కాలనీల్లో 1,000 హిందూ దేవాలయాలు కట్టించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.