Politics1st Nov 03:43 PMSunil Byrisetty1 min read

న్యాయంగా రీపోలింగ్ పెడితే అప్పుడొచ్చి ఓటు వేస్తా

పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరసన తెలిపారు. 70 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించారు. ఆర్వో శ్రీనివా

న్యాయంగా రీపోలింగ్ పెడితే అప్పుడొచ్చి ఓటు వేస్తా
పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరసన తెలిపారు. 70 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించారు. ఆర్వో శ్రీనివాస్‌, ఆర్డీవో చిన్నయ్యతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం నియోజకవర్గంలో ఈ పరిస్థితులేంటంటూ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పులివెందులలో వాళ్లకు నచ్చినట్టు ఓట్లు వేసుకుంటున్నారు. మాజీ సీఎంను కొట్టామని అనిపించుకోవాలంటే చేయండి. లాఠీఛార్జ్‌ చేస్తారా చేయనీయండి.. అదొక్కటే మిగిలింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు ఎందుకు జరపడం లేదు. ఎన్నికలు జరపడానికి చంద్రబాబుకు ఎందుకంత భయం. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవాలు చేసుకుంటారా?. బూత్‌లను క్యాప్చర్‌ చేసి రిగ్గింగ్‌ చేసుకుంటున్నారు. ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు ఎన్నికలు ఎందుకు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నేను ఓటు వేయను, ఎన్నికల్లో దారుణ పరిస్థితులు ప్రజలకు తెలియాలి. ఓటేస్తే అంతా సవ్యంగా ఉందనుకుంటారు. న్యాయంగా ధర్మంగా రీపోలింగ్ పెడితేనే అప్పుడొచ్చి ఓటు వేస్తా’’నని జగన్ స్పష్టం చేశారు.
Scroll for the next article