News26th Jul 11:29 AMSunil Byrisetty1 min read
#IAmMargadarsi పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు #IAmMargadarsi బ్యాడ్జిని అధికారులు చంద్రబాబుకు అందించారు. #IAmMargadarsi పోస్టర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”కుప్పం నియోజకవర్గానికి చెందిన 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను. ఆ కుటుంబాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపు ఇస్తున్నా. ఈ కుటుంబాల అభ్యున్నతి కోసం ప్రణాళిక రూపొందిస్తాను. ఐయామ్ ఏ మార్గదర్శి. పీ4 కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచేలా రూపొందించాం. పేదలకు చేయూతనిచ్చే పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది” అని చెప్పారు.