News12th Oct 05:15 PMSunil Byrisetty1 min read
ఆమ్రపాలికి అదే శాఖలో పోస్టింగ్!
ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి తెలంగాణకు వెళ్లే ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రభుత్వం ఆమెకు మరోసారి టూరిజంలోనే పోస్టింగ్ కేటాయించింది. ఏపీలో పని చేయడంపై ఆసక్తి లేని ఆమ్
ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి తెలంగాణకు వెళ్లే ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రభుత్వం ఆమెకు మరోసారి టూరిజంలోనే పోస్టింగ్ కేటాయించింది. ఏపీలో పని చేయడంపై ఆసక్తి లేని ఆమ్రపాలి సుదీర్ఘ కాలం సెలవు పెట్టారు. సెలవు పూర్తయిన తర్వాత కూడా ఆమె రిపోర్ట్ చేయలేదు. ఇప్పుడు తాను మళ్లీ విధుల్లో చేరుతానని విజ్ఞప్తి చేయడంతో పోస్టింగ్ కేటాయించారు. ఆమ్రపాలిని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా నియమించారు. గతంలో ఆమె ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పని చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ ఆమెకు అదే టూరిజం రంగానికి సంబంధించిన శాఖలోనే కార్యదర్శి స్థాయి పదవిని కేటాయించింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆధ్వర్యంలో ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. తెలంగాణ క్యాడర్ కు వెళ్లడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమెను ఏపీకి కేటాయించారు. కానీ తాను తెలంగాణలోనే ఉంటానని..తన స్థానికత తెలంగాణ అని క్యాట్ నుంచి కోర్టు వరకూ పోరాడారు. ఇంకా ఆమె తెలంగాణకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.