News8th Aug 12:35 PMSunil Byrisetty1 min read

హాట్ టాపిక్ గా సూపర్ ఆఫీసర్ల పోస్టింగ్!

తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు చర్చకు దారి తీశాయి. ప్రత్యేక శైలితో తమదైన ముద్ర వేసిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగులపై సర్వత్రా చర్చ మొదలైంది. ఏపీలో ఆమ్రపాలి,

హాట్ టాపిక్ గా సూపర్ ఆఫీసర్ల పోస్టింగ్!
తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు చర్చకు దారి తీశాయి. ప్రత్యేక శైలితో తమదైన ముద్ర వేసిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగులపై సర్వత్రా చర్చ మొదలైంది. ఏపీలో ఆమ్రపాలి, తెలంగాణలో స్మితా సబర్వాల్ ఇరువురూ డైనమిక్ ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కీలకమైన పోస్టుల్లో నియమితులవుతారని చెబుతుంటారు. కానీ, అలాంటి అధికారులు లూప్‌లైన్‌లోకి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ క్యాడర్‌కు కేటాయించబడిన ఆమ్రపాలి తెలంగాణలో పనిచేయాలని కోరుకుని సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. అయినప్పటికీ వీలుకాకపోవడంతో సెలవుల మీద సెలవులతో చివరికి పోస్టింగ్ లేని బదిలీ ఎదుర్కొన్నారు. తెలంగాణలో సీఎంఓతో పాటు పలు కీలక శాఖల్లో పని చేసిన స్మిత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అప్రాధాన్య పోస్టులోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో పెద్దగా యాక్టివ్ గా ఉండట్లేదు.
AP Politics
IAS Officers
Amrapali Kata
Smita Sabharwal
Andhra Pradesh
Telangana
IAS Transfers
Civil Services
తెలంగాణ రాజకీయాలు
ప్రభుత్వ అధికారులు
సీనియర్ ఐఏఎస్ అధికారులు
Scroll for the next article