Jobs5th Aug 11:45 AMSunil Byrisetty1 min read
విశాఖ తీరం.. కొలువుతీరిన ఐబీఎం
విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం నూతన కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. మంత్రి నారా లోకేష్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో సాగరతీర నగరం గ్లోబల్ ఐటీ హబ్‌గా మరో ముందడుగు వేసి
విశాఖపట్నంలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఐబీఎం నూతన కేంద్రాన్ని ప్రారంభిస్తోంది. మంత్రి నారా లోకేష్ ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో సాగరతీర నగరం గ్లోబల్ ఐటీ హబ్‌గా మరో ముందడుగు వేసింది. తొలి విడతలోనే 500 మందికి పైగా ఐటీ నిపుణులతో తన కార్యకలాపాలను ప్రారంభించిన ఐబీఎం, స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి కెరీర్ అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. ఐబీఎం రాకతో విశాఖ ఐటీ స్వరూపం మరింత బలోపేతం కానుంది. ఈ గ్లోబల్ బ్రాండ్ రాకతో రాబోయే రోజుల్లో మరిన్ని అనుబంధ సాఫ్ట్‌వేర్, ఎంఎన్‌సీ కంపెనీలు విశాఖలో అడుగుపెట్టనున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే.