News31st Aug 10:53 AMSunil Byrisetty1 min read

ఏపీకి ఐబీఎం

ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఆంధ్రప్రదేశ్ కు రానుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం ప్

ఏపీకి ఐబీఎం
ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఆంధ్రప్రదేశ్ కు రానుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పెడుతున్నట్లు దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం ప్రకటించింది. 2026 మార్చి నాటికి దీనిని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంపై ఎక్కువ పరిశోధనలు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికా, జపాన్, కెనడా, దక్షిణ కొరియాలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్లు ఉన్నాయి. భారత దేశంలో ఐబీఎం తొలిసారిగా అమరావతిలో అడుగు పెట్టనుంది.
Andhra Pradesh
IBM
Amaravati
Quantum Computing
Quantum Valley Tech Park
Technology
IT Industry
Research & Innovation
Quantum Center
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్
ఐబీఎం
Scroll for the next article