Entertainment18th Nov 11:09 AMSunil Byrisetty1 min read

ఐబొమ్మలో చివరి అప్డేట్ ఇదే!

కొత్త సినిమాలు విడుదలైన వెంటనే పైరసీలో ప్రదర్శించే ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో చివరి అప్డేట్ వచ్చింది. ఆ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయిన నేపథ్యంలో ఐ బొమ్మ ఓ ప్రకటన విడుదల చేసి

ఐబొమ్మలో చివరి అప్డేట్ ఇదే!
కొత్త సినిమాలు విడుదలైన వెంటనే పైరసీలో ప్రదర్శించే ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో చివరి అప్డేట్ వచ్చింది. ఆ సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయిన నేపథ్యంలో ఐ బొమ్మ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని వెబ్సైట్లో వెల్లడించింది. కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐ బొమ్మ, దాని అనుబంధంగా ఉన్న 65 వెబ్సైట్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బ్లాక్ చేశారు. “మీకు ఇటీవల మా గురించి తెలిసి ఉండొచ్చు. లేదంటే.. మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండొచ్చు. ఏదేమైనా.. మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం" అని ఐ బొమ్మ చివరి అప్డేట్లో పేర్కొంది.
Telugu Cinema
iBomma
Piracy Websites
Final Update
Immdi Ravi Arrest
Hyderabad Cyber Crime
OTT Piracy
Movie Piracy
Website Shutdown
Cyber Crime Action
Scroll for the next article